బస్తా దాన్యానికే 5కిలోల కోత విధించారు.

A cut of 5 kg has been imposed on just a bag of grains.– డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రం నిర్వహకుడు రమేష్ రెడ్డిపై
– భూపాలపల్లి జిల్లా కలెక్టర్, డిఎం కు ఫిర్యాదు చేసిన కొయ్యుర్,వళ్లెంకుంట గ్రామాల రైతులు
నవతెలంగాణ: మల్హర్ రావు.
ఈ రబి సీజన్ లో ప్రభుత్వ మద్దతు ధర కోసం మండలంలోని కొయ్యుర్, వళ్లెంకుంట గ్రామాల్లో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయిస్తే తరుగు పేరిట కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు బొమ్మ రమేష్ రెడ్డి రైస్ మిల్లర్లతో కుమ్మక్కై బస్తాకు 4 నుంచి 5 కిలోల వరకు భారీగా కోత విధించి తమను నిండా ముంచాడంటూ కొయ్యుర్, వళ్లెంకుంట గ్రామాలకు చెందిన అయిత భాస్కర్, మెట్టు శంకర్, వేముల పర్వతాలు, ఎడ్ల లింగయ్య, మంథని సీతారామరావు,ముల్కల లక్ష్మయ్య, ముని సీతారామరావు,సంతోషం వీరయ్య, వెన్నపురెడ్డి మల్లయ్య, అయిత సమ్మిరెడ్డి, వేల్పుల లచ్చయ్య, గడ్డం స్వరూప,కొండ అశోక్ తదితరులు సోమవారం ప్రజావాణిలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డిఎం కు పిర్యాదు చేశారు.ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడారు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు కటింగ్ పేరిట రైస్ మిల్లలర్లతో కుంమ్మకై ముంచడాని,కల్లంలో దాన్యం తూకం వేసినప్పుడు రాసిన ట్రక్ సిట్ కు కటింగ్ తరువాత చూపిన ట్రక్ సిట్ కు పొంతన లేదని,రైస్ మిల్లు వద్ద కోత విధించినట్లుగా ఆన్ లైన్ లో పొందుపరిచిన పూర్తి డాటా నిర్వహకుడిని నిలదీస్తే పొంతన లేని సమాధానం చెప్పడమే కాక నీకు దిక్కున్న చోట చెప్పుకొని అంటుంన్నట్లుగా బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తనను తరుగు పేరిట 164 క్వింటాళ్ళ దాన్యం దోపిడీకి గురికావడంతో రూ.3.2800 లక్షల వరకు నష్టం జరిగిందని వాపోయారు.తమకు న్యాయం చేసి, నిర్వహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు

Spread the love