దళిత మహిళపై పోలీసు లైంగికదాడి

నవతెలంగాణ -ఉత్తరప్రదేశ్‌:  పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్‌స్పెక్టర్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలోకి వేలితే.. సరాయ్ మమ్రేజ్ పోలీస్ స్టేషన్‌లో సుధీర్ కుమార్ పాండే సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. కొందరు ఆకతాయిలు తనను వేధింపులకు గురి చేస్తున్నారని, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన దళిత మహిళ ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చింది. ఎస్సైకి ఫిర్యాదు చేసింది. ఎస్సై నిందితులను అరెస్టు చేసేందుకు వెళుతున్నట్లు చెప్పి మహిళను తన కారులో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో కారు ఆపి మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను మహిళతో తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మెలుకువ వచ్చాక విషయం తెలుసుకున్న బాధితురాలు సదురు పోలీసుపై ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21న సుధీర్ కుమార్ పాండే తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దాంతో సీనియర్ పోలీసు అధికారి అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. పరారీలో ఉన్న ఎస్సై కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Spread the love