– కుల్చేయండని ఇంటి యజమాని..
– పిర్యాదు చేసిన నిర్లక్ష్యం..
– వర్షాలతో పొంచి ఉన్న ప్రమాదం..
– నోటీసులిచ్చిన కాలయాపన చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
– బేగం బజార్ స్వస్తిక్ మిర్చి సమీపంలో..
– జోనల్ కమిషనర్ ఆదేశాలు భేఖతర్..
– ఆందోళన చెందుతున్న స్థానికులు..
నవతెలంగాణ – ధూల్ పేట్
ప్రమాదకర పాత భవనాలు, శిథిలావస్థకు చేరిన భవనాలను కుల్చివేసెందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు. వర్షా కాలం లో ప్రస్తుతం కురుస్తున్న ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముందస్తుగా ప్రమాదకర భవనాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చి వేస్తున్నారు అధికారులు. గోషామహల్ జీహెచ్ఎంసీ సర్కిల్ – 14 పరిధిలోని బేగం బజార్ స్వస్తిక్ మిర్చి సమీపంలో ఇంటి నంబర్ 15-8-351గత నెళ్లాలుగా మా ఇళ్ళు కుల్చేయ్యండి సార్ అంటూ కార్యాలయ అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోక పోవడం గమనార్హం.
యజమాని చెప్పిన..
భారీ వర్షాల నేపత్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చి వేస్తారు. ఒక వేళ ఇంటి ఓనర్ ఒప్పుకోక పోయిన నోటీసులిచ్చి, పోలీస్ బందోబస్తు తో పక్కవారికి, దారిపొడవునా పోయే వారికి ప్రమాదం సంభవించకుండా ప్రత్యేక బలగాలతో చర్యలు తీసుకుని మరీ కూల్చి వేస్తారు. ప్రమాదాలు సంభవించకుండా చూస్తారు జీహెచ్ఎంసీ అధికారులు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా చేస్తున్నారు జీహెచ్ఎంసీ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ అధికారులు. కుల్చమని ఇంటి యజమాని అధికారులకు పిర్యాదు చేసి చుట్టూ తిగుతున్న పట్టించుకోకుండా కాలయాపన చేయడం విశేషం. ఈ వర్షాలతో ఎక్కడ గోడలు కూలి దారి వెంబడి పోతున్న వారి పై ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
సెక్షన్ అధికారి నిర్లక్ష్యం..
కూలి పోవడానికి సిద్దంగా ఉన్న కుల్చకుండ కాలయాపన చేస్తున్నారు సెక్షన్ అధికారి కింది స్థాయి సిబ్బంది. ఈ మధ్యకాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోపలి భాగాలు, పైకప్పు పూర్తిగా కూలిపోయాయి. బయటి గోడలు కులాడానికి సిద్దంగా ఉన్నాయి. దీంతో రక పొకలు సాగించే వారు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన వ్యాపార కూడలి కావడంతో నిత్యం ట్రాలీ ఆటో, రిక్షా, హమాలి కార్మికులు, వ్యాపారులు కొనుగోలు దారులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. దీన్ని పై పలుమార్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారి దృష్టికి తీసుకెళ్లినా, సెక్షన్ అధికారికి చెప్పడం,.. సెక్షన్ నిర్లక్ష్యం. దీంతో స్థానికులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో నని భయందోళ్ళనకు గురౌతున్నారు.
ఖాళీ చేసి అర్న్నెల్లైన..
పాత భవనం ఎప్పుడు కూలిపోతుందొనని ముందస్తుగానే యజమాని ఖాళీ చేసి అడ్డేకుంటున్నారు. అక్కడే అద్దెకు ఉండి దుకాణాలు నడుపుకునే వారు ఖాళీ చేశారు. దీన్ని గమనించిన అధికారులు నోటీసులిచ్చి వదిలేశారు. దీంతో ఇంటి యజమాని డేమాలిషన్ చేయాలని పిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. వర్షాల నేపథ్యంలో కూలిపోయే భవనాన్ని అధికారులు కుల్చకుండ వదిలేయడం పై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన పట్టించుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ కు, కమిషనర్ కు…
గత 2017 నుండి బేగం బజార్ 15-8-351 ఇళ్ళు కూలి పోవడానికి ప్రమాదకరంగా ఉంది కూల్చి వెయ్యాలని జేఎన్టీయు నోటీస్ జారీచేసింది. పాటు బాధితులు ఎన్డెమోలిషన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు పిర్యాదు చేశారు. గత నాలుగేళ్లుగా పట్టించుకోకుండా నోటిసిలిస్తు చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. దీంతో బాధితులు స్థానిక నాయకులు పట్టించుకోక పోవడంతో ఎంఐఎం నాయకులను ఆశ్రయించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ పరిశీలించి వెంటనే కూల్చి వేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాక జిల్లా కలెక్టర్ కు, జీహెచ్ఎంసీ కమిషనర్ కు, జోనల్ కమిషనర్ లకు పిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించక పోవడం గమనార్హం.