– గ్రామంలో విషాద ఛాయలు..
నవతెలంగాణ – తాడ్వాయి
రైతును మతిస్థిమితం లేని వ్యక్తి కర్రతో దాడి చేసి చంపిన ఘటన కాటాపూర్ లో ఆదివారం చోటు చేసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామానికి చెందిన మోరే బిక్షపతి (ఎర్ర) (45) అనే రైతు పొలం వద్దకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రం వద్దకు రాగానే ఆ బర్కాల షెడ్ కింద ఉన్న, మతిస్థిమితం లేని వ్యక్తి కర్రతో దాడి చేశాడు. ద్విచక్ర వాహనం పై నుండి కింద పడిపోయాడు, తలపై మళ్లీ కర్రతో బలవంతంగా కొట్టాడు. దీంతో ఆ రైతు తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లి పడిపోయాడు. 108 వాహనం ద్వారా ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఆదివారం కావడంతో వైద్యులు సక్రమంగా లేనందున హన్మకొండ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి వైద్యులు పూర్తిగా ఆరోగ్యం క్షీణించిందని ఎంజీఎం కు ఎంజీఎం కు తరలించారు. ఎంజీఎంలో వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. అతనికి భార్య కుమారి, ఇద్దరు కొడుకులు ప్రణయ్, వినయ్ లు ఉన్నారు. తాడ్వాయి పోలీసులు అతని భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.