మండలంలోని ఉప్లూర్ లో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న మహాలక్ష్మి అమ్మవారి (పోచమ్మ) ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన సరసం గంగారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుండి రూ.లక్ష విరాళంగా అందజేశారు. సరసం గంగారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఎన్నారై డాక్టర్ సరసం రాజేశ్వర్ సూచనల మేరకు ట్రస్ట్ చైర్మన్ సరసం చిన్నారెడ్డి శనివారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు విరాళం మొత్తానికి సంబంధించిన రూ. లక్ష చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సోమ దశరథ్, కొమ్ముల రవీందర్, వన్నెల రాజేశ్వర్, బద్దం ధన్ రెడ్డి, చింతకుంట శ్రీనివాస్, గొల్ల మల్లయ్య, సరసం గంగారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బద్దం నాగేష్, బద్దం మోహన్, తదితరులు పాల్గొన్నవారు.