బీసీ, ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలి..

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణ కేంద్రంలోని బీసీ ,ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని  పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంల పట్టణ కేంద్రంలోని బీసీ బాలికల వసతిగృగం ఎస్టీ బాలికల కళాశాల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని శిథిల వ్యవస్థలో ఉన్న వసతిగృహాన్ని పరిశీలించి ఆర్డిఓ గారికి వినతిపత్రం అందించడం జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పట్టణ కేంద్రంలోని శిథిల వ్యవస్థలో ఉన్న బీసీ బాలికల స్కూల్ హాస్టల్ ను ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలలుగా అధికారులకు విన్నవించుకుంటే ఏమాత్రం స్పందన లేదని వారు అన్నారు. మరో వైపు గత మూడు సంవత్సరాల కింద ఇంజనీర్లు వచ్చి హాస్టల్ చూసి కొలతలను తీసుకొని నేటి వరకు పనులు ప్రారంభించకుండా కాలయాపన చేయడం సరైనది కాదని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద ఏం మాత్రం చిత్తశుద్ధి ఉన్న ఏమాత్రం ప్రేమ ఉన్న విద్యార్థుల సమస్యల్ని పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కేవలం ఎన్నికల కోసమే ఓట్ల కోసమే పనిచేస్తున్నారని వారు అన్నారు. కానీ విద్య రంగ సమస్యలు పరిష్కరించడం గాని విద్యార్థుల సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని వారు ఎదవా చేశారు. పట్టణ కేంద్రంలో ఎస్టీ బాలికల కళాశాల భవనాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్టీ బాలికల వసతి గృహం లేకపోవడం ద్వారా విద్యార్థినిలు తమ చదువులకు దూరం అవుతున్నానని వారు తెలిపారు పక్కనున్న ఎస్సీ బీసీ కళాశాల వసతి గృహంలో రేషియో ప్రకారం ఎస్టీ గిరిజన బాలికలకు అడ్మిషన్లు లేవని చెప్పడం ద్వారా చదువు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పట్టణ కేంద్రంలోని బీసీ ఎస్టీ బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థులతో స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెనకాడబొమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఎస్ దుర్గాప్రసాద్ , ఏరియా నాయకులు వినోద్ సాయి కృష్ణ రాజు వేణు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు..
Spread the love