బ్లాక్ బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్ ‘మత్తువదలరా2’. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 13న విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ సింహ మీడియాతో మాట్లాడుతూ, ‘ఫస్ట్ పార్ట్ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతాయి. డెలివరీ బార్సు నుంచి ఏజెంట్స్ ఎలా అయ్యారనే లింక్ చూపిస్తాం. ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేసి, చాలా ఎంజారు చేశారు. టీజర్, ట్రైలర్, సాంగ్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు.ఇందులో ఫరియాది ఫన్నీ క్యారెక్టర్. తన పాత్రకి యాక్షన్ కూడా ఉంది. ఈ సినిమాలో తను సాంగ్ రాయడంతో పాటు కొరియోగ్రఫీ కూడా చేసింది. ఫస్ట్ పార్ట్‌లో మర్డర్ ఎవరు చేశారు అనే ట్రాక్‌తో పాటు డ్రగ్స్ ట్రాక్ ఉంటుంది కదా.. ఇందులో కూడా ఆ రెండింతో పాటు ఇంకొన్ని లేయర్స్ యాడ్ అవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేక్షకులకు డబుల్ థ్రిల్ ఇచ్చే సినిమా ఇది’ అని అన్నారు.