పేరుగాంచిన సెంటిమెంట్‌ ఆలయం

– కేసీఆర్‌, హరీశ్‌రావు, కేపీఆర్‌ గెలుపు
– అధికారంలోకి రాలేదని నిరాశ
నవతెలంగాణ-నంగునూరు
సెంటిమెంట్‌ దేవాలయంగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావు, మరో రోజు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి భార్య దర్శించుకున్న విషయం తెలిసిందే. వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నామినేషన్‌ పత్రాలను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో నామినేషన్‌ పత్రాలపై మాజీ సీఎం కేసీఆర్‌ సంతకాలు చేశారు. 1985 నుంచి ఎన్నికల సమయంలో కేసీఆర్‌ హాజరై పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్‌ రావు ఏడవసారి నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు. ఈ నెల 3న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌, సిద్దిపేట నుంచి హరీశ్‌రావు, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్‌ రెడ్డి గెలుపొందారు. మూడోసారి అధికారం లోకి రాలేదని నిరాశతో ఉన్నారు.

Spread the love