ఏపీలో కరెంట్‌ షాక్‌తో రైతు, మెకానిక్‌ మృతి

నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరెంట్‌ షాక్‌తో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కుమ్మర కొండూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జునరెడ్డి (35) పొలం వద్ద ఉన్న బోరు మోటారు మరమ్మతుకు గురైంది. దీంతో రైతు అయ్యప్పరెడ్డి పాలెంకు చెందిన ప్రైవేట్‌ మెకానిక్‌ నారాయణ(40) ను ఆశ్రయించాడు. గురువారం ఇద్దరూ పొలం వద్ద మోటార్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Spread the love