మోహదీపట్నం అంకుర ఆసుప్రతిలో ఘోర ప్రమాదం


నవతెలంగాణ – హైదరాబాద్‌: గుడి మల్కాపూర్‌లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదోఫ్లోర్‌ నుంచి పదో ఫ్లోర్‌ వరకు మంటలు అంటుకున్నాయి. పైనుంచి అగ్నికీలలు కిందపడుతున్నాయి. దీంతో పరిసరాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదు.

Spread the love