ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Accidentనవతెలంగాణ- సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి వద్ద ముందుగా వెళ్తున్న లారీని అతివేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love