అందరం గర్వపడే ఉత్సవం

అందరం గర్వపడే ఉత్సవందిలీప్‌ ప్రకాష్‌, రెజీనా కసాండ్రా లీడ్‌ రోల్స్‌లో అర్జున్‌ సాయి రచన, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.
ఈనెల 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో దిలీప్‌ ప్రకాష్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ఇందులో కథే హీరో. రంగస్థల కళాకారుల మీద తీసిన సినిమా ఇది. సురభి నాటక సమాజం స్ఫూర్తి ఉంది. సినిమా వచ్చిందే నాటకాల నుంచి. మన రూట్స్‌ని గుర్తు చేసేలా ఉంటుంది. ఇందులో హీరోది నాటకాలను మళ్ళీ తీసుకొచ్చే క్యారెక్టర్‌. అయితే ఇదంతా సందేశం చెప్పేలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్‌ విధానంలోనే చూపించాం. ఇందులో తెలుగు కల్చర్‌, ట్రెడిషన్‌ చాలా అద్భుతంగా చూపించాం. అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చారు. ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం ఇలా చాలా మంది అద్భుతమైన యాక్టర్స్‌ ఉన్నారు. వారందరి నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు ఇదొక వండర్‌ఫుల్‌ జర్నీ’ అని అన్నారు.

Spread the love