నా కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా

A film that I am proud of in my careerవిరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దీనికి డివోపీగా చేసిన ఛోటా కె. నాయుడు విలేకరులతో మాట్లాడుతూ, ‘తన సినిమాల్లానే దర్శకుడు శ్రీకాంత్‌ చాలా కూల్‌గా ఉంటారు. అయితే నారప్పతో ఆయనలో ఒక కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్‌ వచ్చింది. ఈ కథ చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ట్రైలర్‌లో ఏది చూశామో అంత ఇంటెన్స్‌గా చెప్పారు. ఈ సినిమాతో తను నటన కూడా మొదలుపెట్టారు. ఈ కథ కొత్త ప్యాట్రన్‌, కొత్త కలర్స్‌, మేకింగ్‌ని డిమాండ్‌ చేసింది. ఇది నాకు సవాల్‌గా అనిపించింది. ట్రైలర్‌ విజువల్‌గా చాలా ఇంపాక్ట్‌గా ఉండటానికి కారణం దర్శకుడే. దర్శకుడి హెల్ప్‌తోనే ఇలాంటి అవుట్‌పుట్‌ వస్తుంది. హీరో ఎలా ఉండాలో కెమెరామెన్‌గా నాకొక విజన్‌ ఉంటుంది. విరాట్‌ కొత్తవాడు అనే ఫీలింగ్‌ రాలేదు. ఈ కథని 1983లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినపుడు మొదలైన ఇన్సిడెంట్‌తో రాసుకున్నాడు. మిక్కీ ఇచ్చిన నేపథ్యంలో సంగీతం నన్ను సర్‌ప్రైజ్‌ చేసింది. అలాగే హీరోయిన్‌ ప్రగతి కూడా టెర్రిఫిక్‌గా పెర్ఫార్మ్‌
చేసింది. నా కెరీర్‌లోనే గర్వంగా చెప్పుకునే సినిమా ఇది’ అని అన్నారు.

Spread the love