కులవృత్తులకు ఆర్థిక సహాయం నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలి..

– వృత్తిదారులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలి..
– ఫైళ్ళ ఆశయ్య, టీఆర్వీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
నవతెలంగాణ – తొర్రూరు
కులవృత్తులకు ఆర్థిక పథకం నిజమైన లబ్ధిదారులకే వర్తించేలా చేయాలని, పైళ్ళ ఆశయ్య ప్రభుత్వాన్ని కోరారు. రజక వృత్తిదారుల సమస్యలపై మహబూబాబాద్ జిల్లా సదస్సు తిరుమల ఫంక్షన్ హాల్ తొర్రూరులో పున్నం సారయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 లక్షల మందిపైగా రజక వృత్తిదారులు ఉన్నారని సామాజికంగా ఆర్థికంగా తీవ్ర వెనుకబడి ఉన్నారని ఆయన అన్నారు. ఇటీవల ప్రభుత్వం కులవృత్తుల ఆర్థిక పథకం ప్రవేశపెట్టిన అందులో రాష్ట్రంలో 1,10,000 మంది ఆర్థిక సాకార కోసం రజక వృత్తిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేయడం జరిగింది. వెరిఫికేషన్ కూడా చేశారు. నిధులు లేవని అనేక జిల్లాల్లో మొదటి దశాలో ఆర్థిక సహకారం అందలేదని ఆశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా చేయకుండా ప్రజా ప్రతినిధులు జోక్యం తగ్గించాలని నిజమైన పేద వృత్తిదారులకే లక్ష రూపాయల ఆర్థిక సహకారం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా వృత్తిలో కొనసాగుతున్న 50 ఏళ్ళు నిండిన వృద్ధులకు పెన్షన్ పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టాలని, మండల, పట్టణ, మేజర్ గ్రామపంచాయతీలో రజక కమ్యూనిటీ హాల్ కు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రజకులపై జరుగుతున్న సామాజిక దాడులు అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం ప్రవేశపెట్టి రక్షణ కల్పించాలని కోరారు. రూ: 5లక్షల బీమా పథకం ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏదునురి మదారు మాట్లాడుతూ..  ఇండ్లు, ఇళ్ల స్థలాలు లేని పేద రజకులకు డబల్ బెడ్ రూమ్ ల ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. స్థలమున్న రజకులకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని, గ్రామీణ ప్రాంతంలో రజక సొసైటీల నిర్మాణానికి బీసీ కార్పొరేషన్ అధికారులు వెంటనే రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ బొల్లం అశోక్, నల్గురి రామలింగం, బొనగిరి లింగమూర్తి, నిమ్మల సోమయ్య, పొడగంటి శేఖర్, దుగ్గి లక్ష్మీనారాయణ, బండి రాము, మచ్చ బిక్ష పతి, రాపోలు సుదర్శన్, దుగ్గి రవి, వరిపెల్లి పూర్ణ, బుతరజు సోమయ్య, మదిపెడ్డి వెంకన్న, యకయ్య, రాములు, వెంకన్న, ఉప్పాలయ్య, లంక శ్రీకాంత్, వెంకటేష్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love