నాగార్జునసాగర్ అడవిలో చెలరేగిన మంటలు..

నవతెలంగాణ – నల్లగొండ: నల్లగొండ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నాగార్జునసాగర్ కోర్ ఫారెస్ట్‌ పరిధిలోని నాగార్జునసాగర్‌ బీట్‌ పరిధిలోని మూలతండా, సమీపంలో మంటలు చెలరేగాయి. ఆదివారం రాత్రి సుమారు సమయంలో ఫారెస్ట్‌లోని గుట్టపైన మంటలు చెలరేగాయి. అవి క్రమేణా పెద్దివి కావడంతో స్థానిక తండావాసులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ సిబ్బంది వచ్చే సరికి సుమారు ఆరు ఎకరాల్లో అడవికి మంటలు చెలరేగడంతో సమీపంలో ఉన్న తండావాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో స్థానిక ఫారెస్ట్‌ సిబ్బంది అడవిలో వ్యాపించిన మంటలను మంటలు లేచి అడవిని చుట్టుముట్టడంతో అటవీశాఖ సిబ్బంది ఆప్రాంతానికి వెళ్లి ఫైర్‌బ్లోయర్ల సహాయంతో ఆర్పారు. కిలోమీటరు మేరమంటలు అంటుకోవడంతో అష్టకష్టాలు పడి మంటలను అదుపులోకి తెచ్చారు. నాగార్జునపేట ప్రాంతంలో రైతులు పత్తికట్టెతో పాటు చెలకలలో ఉన్న చెత్తచెదారాలను తగుల బెట్టి వాటిని ఆర్పకుండానే రావడంతో గాలికి సమీపంలోగల అటవీ ప్రాంతం అంటుకుంది.

Spread the love