కదులుతున్న కారులో మంటలు..

నవతెలంగాణ – హైదరాబాద్: కదులుతున్న కారలో మంటలు రేగిన ఘటన నార్సింగ్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. టిప్ఖాన్పూల్ బ్రిడ్జి సమీపంలోని ఆర్మీ స్కూల్ దగ్గర కదులుతున్న కియా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జనాలు చూస్తుండగానే కారు కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది గంటసేపు శ్రమించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినా కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో రోడ్డుపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి ప్రాణాపాయం జరగలేదని తెలిపారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love