నవతెలంగాణ – హైదరాబాద్ : నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. మాసబ్ ట్యాంక్ నుంచి లక్డీపూల్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.