బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయకార ఒప్పందం..

– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ-రామారెడ్డి :
బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీలు ఒకటేనని, వారి మధ్య లోపాకార ఒప్పందాలు జరుగుతున్నాయని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. లిక్కర్ స్కాంలో దేశాన్ని కుదిపేస్తూ, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని నానా హంగామా చేసి, చివరికి రెండో చార్జి సీట్లో క్లీన్ చీట్ ఇవ్వటం వెనుక ఈ బిజెపి అంతర్యం ఏమిటని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ముందుకు సాగకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, కేసులను తప్పుదోవ పట్టించి, అసలు దోషులను తప్పించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.    బిజెపి కార్పొరేట్ సంస్థలైన ఆదానీలకు అంబానీలకు దోచిపెడితే, తెలంగాణలో కాలేశ్వరం పేరుతో దొరల కుటుంబాలు దోచుకుంటున్నాయని, దేశంలో బాగుపడ్డది, గుజరాత్ కార్పోరేట్ సంస్థలేనని, తెలంగాణలో దొరల కుటుంబాలు బాగుపడ్డాయి గాని,  సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, ప్రజలు గమనిస్తున్నారని, బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
Spread the love