బడి కిచెన్‌ షెడ్డులో గొర్రెల మంద

A flock of sheep in the school kitchen shed– బిల్లులు చెల్లించడం లేదని మాజీ చైర్మెన్‌ నిరసన
నవతెలంగాణ-మల్లాపూర్‌
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు చాలా కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఓ మాజీ ప్రజాప్రతినిధి బడిలో నిర్మించిన వంట షెడ్డులో గొర్రెలను తోలి నిరసన వ్యక్తం చేశారు. మన ఊరు-మనబడి మొదటి విడత పనుల్లో భాగంగా నిర్మించిన వంట గది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో సోమవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని రేగుంట గ్రామంలో ఎస్‌ఎంసీ మాజీ చైర్మెన్‌ దండికే శంకరయ్య వంటశాలలో గొర్రెలను తోలి నిరసన తెలిపాడ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేగుంట గ్రామంలో మన ఊరు మనబడి మొదటి విడతలో పాఠశాలలో కిచెన్‌ షెడ్‌ నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఏడాది గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. ఇటీవల కిచెన్‌ షెడ్‌ నిర్మాణం పూర్తయినప్పటికీ ఖాతాలో ఉన్న 2లక్షల 35 వేల రూపాయలు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో ఉన్న తాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక సోమవారం ఉదయం బడి పిల్లలు వచ్చే సమయానికి మేకలు, గొర్రెల మందను నూతనంగా నిర్మించిన కిషన్‌ గదిలోకి తోలి.. అధికారులకు విషయం చెప్పానని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు రావాల్సిన బిల్లులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ఎంఈవో వాసం భీమయ్యని స్పంది్తూ.. కిచెన్‌ షెడ్డుకు సంబంధించిన డబ్బులు ఖాతాలో జమ అయినా.. వాటిని ఎలా డ్రా చేయాలనేది ప్రభుత్వం నుంచి ఎటువంటి విధివిధానాలూ రాలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని అందజేస్తామని చెప్పారు.

Spread the love