నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో నగదు, బంగారం, సెల్ ఫోన్ గల బ్యాగును ప్లాట్ ఫామ్ పై మర్చిపోయిన బాధితులకు పిలిపించి అప్పగించినట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 7 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు డ్యూటీ లో భాగంగా ప్లాట్ ఫార్మ్ పై చెక్ చేయగా వారికీ ఒక బ్యాగ్ కనిపించగా వెంటనే అక్కడ ఎవరైనా ఉన్నారేమో అనీ కొద్దిసేపు చూసి ఎవరూ లేనందున ఆ బ్యాగ్ను పోలీస్ స్టేషన్ కు తీసుక వచ్చి బ్యాగ్ చెక్ చేయడం జరిగిందన్నారు. అందులో ఐదు వందల నోట్లు ఒక లక్ష ఎనిమిది వేయిల ఐదు వందల రూపాయలు, ఒకటిన్నర తులాల బంగారు చైన్ అలాగే అర్ద తులం ఉంగరం, బట్టలు, ఫోన్ ఉంందని తెలిపారు. వెంటనే ఆ ఫోన్ ద్వారా అందులో ఉన్న ఎటిఎం కార్డు ద్వారా వారిని కనుక్కొని పిలిపించామన్నారు. అతని పేరు మామిడాల నర్సయ్య జగిత్యాల జిల్లా తెలియజేేశాడు. వారు ముంబై నుండి నిజామాబాదు కు శుక్రవారం వచ్చి వారి దగ్గర ఉన్న అన్ని బ్యాగులు తీసుకొని కార్ లో వెళ్లుచు ఇక్కడ ఒక బ్యాగు మరచి పోయినాము అని తెలియజేశారు. బ్యాగులో ఉన్న డబ్బులు, బంగారం, చైన్, రింగు అన్ని రీసెప్ప్ట్ తీసుకొని ఫోటో తీసుకొని అప్పజెప్పడం జరిగిందన్నారు. బ్యాగును భద్రం చేసి బాధితులకు అప్పగించేందుకు కృషిచేసిన హెడ్ కానిస్టేబుల్, సీనా నాయక్ కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పాష లను ప్రత్యేకంగా అభినందించారు.