ఘోరం.. యువకుడి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్‌ ఛాలెంజ్‌

నవతెలంగాణ – కర్ణాటక :కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. ఫెండ్స్‌ ఛాలెంజ్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఛాలెంజ్‌ చేసి మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అయితే మునిగిపోతున్న ఆ యువకుడ్ని స్నేహితులు కాపాడకుండా చోద్యం చూస్తూ వీడియో తీశారు. పైగా దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో పోలీసుల వద్దకు చేరుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన సాజిద్‌గా గుర్తించారు. అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Spread the love