– 7గురు నిందితుల నుండి 31 తులాల బంగారం..
– కేజీ వెండి ఆభరణాలు,28 వేల నగదు,హోండా ఆక్టివా స్కూటి, ఇనుప రాడ్డు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం
– కేజీ వెండి ఆభరణాలు,28 వేల నగదు,హోండా ఆక్టివా స్కూటి, ఇనుప రాడ్డు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం
– నిందితులపై నల్లగొండ, జనగామ, రాచకొండ కమిషనర్ పరిధిలో 30 చోరీ నేరాలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఏడుగురు నిందితుల నుండి 31 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలు, 28 వేల నగదు, హోండా యాక్టివా స్కూటీ, ఇనుప రాడ్డు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మంగళవారం అయన ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో పక్క సమాచారముతో నల్గొండ సిసిఎస్, తిప్పర్తి పోలీసులు సంయుక్తముగా కలిసి తిప్పర్తి పిఎస్ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి క్రాస్ రోడ్ లో (ఎస్ హెచ్-2) వాహనములు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళ్లుచున్న TS-05-FQ-4066 నంబర్ గల హోండా ఆక్టివా స్కూటి పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, పెద్ద సూరారం గ్రామ పరిధిలో గత నెల 30వ తేదీన పగటి పూట ఓ ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం చేసినట్లు తెలిపారు. స్కూటినీ తనిఖీ చేయగా చోరీ నేరములో దొరికిన బంగారు ఆభరణాలను, నేరములో ఉపయోగించిన ఇనుప రాడ్డును మొదటగా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బంగారు ఆభరణాలను మిర్యాలగూడలో అమ్మడానికి వెళుతున్నట్లు పట్టుబడిన ఇద్దరు నేరస్థులు తెలిపారని పేర్కొన్నారు. పట్టుబడిన నేరస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ముఠాలోని 4గురు సభ్యులను చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామములొ, మరొక నేరస్థుడిని వలిగొండలో అదుపులోనికి తీసుకోవడము జరిగినట్లు వివరించారు. పట్టుబడిన నేరస్థులను అందరిని విచారించగ నేరస్థులు అందరూ ఒక ముఠా గా ఏర్పడి నల్గొండ జిల్లాలో, రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. నేరస్థులలో ఒక్కరూ మినహా మిగిలిన నేరస్థులు అందరూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందినవారని తెలిపారు. వీరిలో గుండెబోయిన మహేశ్, గుండెబోయిన మల్లేశ్ మినహా మిగిలిన వారు అంధరు పాత నేరస్థులని, వీరి పైన గతములో నల్గొండ, జనగామ, రాచకొండ కమిషనరేట్ పిఎస్ పరిధిలలో చోరీ నేరాలు ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన నేరస్థులు గతములో జైలుకు వెళ్ళినా తమ బుద్ది మార్చుకొకపోగా తిరిగి నేరాలు చేయాలనీ నిర్ణయించుకున్నారని, అనుకున్న ప్రకారముగా నేరస్థులు వారు తయారు చేపించుకున్న ఒక ఇనుప రాడ్డు సహాయముతో గ్రామాలల్లో, పట్టణాలల్లో తాళము వేసిన ఇండ్లను ఎంచుకొని రాత్రి, పగలు అనీ తేడా లేకుండా చోరీ నేరాలు చేస్తూ పట్టుపడ్డారని వివరించారు. వారిపై ఇప్పటికే పలికేసులు ఉన్నట్లు తెలిపారు. నల్గొండ డిఎస్పి కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేంధర్ రెడ్డి ఆద్వర్యములో శాలిగౌరారం ఇన్స్పెక్టర్ కొండల్ రెడ్డి, తిప్పర్తి ఎస్ఐ రాజు,సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, లింగారెడ్డి, వహీద్ పాషా, రాము, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆధ్వర్యంలో నేరస్థులను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ ఈ సందర్భంగా వారిని అభినందించారు.