ఫిలింనగర్‌లో హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్టు

నవతెలంగాణ- హైదరాబాద్‌: ఫిలింనగర్‌ పరిధిలో హాష్‌ ఆయిల్‌, చరస్‌ను విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యుల ముఠాను ఆదివారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్టు చేసి ఫిలింనగర్‌ పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 310 మి.లీ హాష్‌ ఆయిల్‌, 70 గ్రాముల చరస్‌, ఒక వాహనంతో పాటు 8 చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అరకు నుంచి తక్కువ ధరకు తెచ్చి నగరంలో నిషేధ మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ దాదాపు రూ.2.28లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Spread the love