సాదాసీదాగా మోపాల్ మండల సర్వసభ్య సమావేశం..

నవతెలంగాణ – మోపాల్ 

శనివారం రోజున స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లతా కన్ని రామ్ అధ్యక్షతన సర్వే సభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశం నామమాత్రంగానే జరిగింది ఒకరిద్దరు ఎంపీటీసీలు మాత్రమే తమ గ్రామ సమస్యలను అక్కడున్న అధికారుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ రామారావు మాట్లాడుతూ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే మండల కేంద్రంలో గల రెండు ప్రభుత్వ పాఠశాలలో 10/10 ఇద్దరు విద్యార్థులకు రావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏవో రవీందర్ మాట్లాడుతూ రైతులు తమ పొలాలలో పంట కోసిన వెంటనే వాటిని తగలబెట్టకుండా అందులోనే ఆ గ్రసాన్ని ఎరువుగా మార్చుకోవాలని దాని వల్ల భూమికి సరైన పోషకాలు అందుతాయనీ అలాగే వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చని ఆయన తెలిపారు అలాగే జీలుగు విత్తనాలు కూడా మన సొసైటీలోకి అందుబాటులోకి వచ్చాయని ఒక హెక్టార్ కి ఒక బ్యాగు చెప్పురా సొసైటీలో ఇవ్వడం జరుగుతుందని తెలుపుతూ రైతు భరోసా డబ్బులు కూడా జమవుతున్నాయని ఆయన సభ దృష్టిలో తెలియపరిచారు, ముఖ్యంగా ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ కి గ్రామంలో చెక్ డాం కోతకు గురవుతుందని దానికి మరమ్మతులు చేపట్టాలని  ఎంపీపీ ఎ ఈ  దృష్టికి తీసుకురావడం జరిగింది .అతి త్వరలో చెక్ డాం గురించి నివేదికను తయారుచేసి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాలని ఆయన సమాధానం ఇచ్చాడు  అలాగే ఎంపీపీ లతా మాట్లాడుతూ తమ పదవి కాలంలో సహకరించిన అధికారులకు మరియు ఎంపీటీసీ లకు ధన్యవాదాలు తెలిపారు అతి త్వరలో తన పదవి కాలం ముగుస్తుందని ఆమె కోరుతూ అలాగే తన పదవి కాలంలో తాను చేసిన అభివృద్ధి గురించి తెలిపారు అతి త్వరలోనైనా మోపాల్ మండలంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం గానీ తాహసిల్దార్ కార్యాలయం గానీ ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లింగం నాయక్, మండల్ తాసిల్దార్ రామేశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ స్రవంతి, మిషన్ భగీరథ ఏ ఈ వినయ్ రెడ్డి, ఐసిడిఎస్ అధికారులు, ఉపాధి హామీ ఫీల్డ్ అధికారులు, మరియు ఎన్జీవోస్, ఎంపీటీసీలు రాములు, రమేష్, రఘు,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love