– నౌరియల్ రౌబినీ హెచ్చరిక
దోహా: అప్పు పరిమితిపై ఆంక్షలను తొలిగించు కోవటంలో అమెరికా ప్రభుత్వం విఫలమైతే మార్కెట్లు దెబ్బతింటాయనీ, దీర్ఘకాలంలో డాలర్ పైన విశ్వాసం పోతుందనీ ప్రముఖ ఆర్థికవేత్త, న్యూయార్క్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నౌరియల్ రౌబినీ హెచ్చరించారు.
‘చివరి నిమిషం వరకూ అంగీకారం జరగక పోవచ్చు’ అని తెలిపారు. దోహాలో జరుగుతున్న కతార్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బ్లూమ్‌బర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘అమెరికా ఒక అంగీకారానికి రాకపోవటానికి కూడా అవ కాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మార్కెట్ పతనం అనివార్యం’ అని ఆయన అన్నారు.
2008-2009 నాటి ఆర్థిక సంక్షోభా న్ని ముందుగానే ఊహించి నందున రౌబినీకి వాల్ స్ట్రీట్ ‘డాక్టర్ డూమ్’ అనే పేరు వచ్చింది. భౌగోళిక రాజకీయాలు, క్షీణిస్తున్న అమె రికా, చైనాల ఆర్థిక సంబంధాలు ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాలుగా మా రాయి. జూన్ 1వ తేదీ తరువాత అమెరికా చేయ వలసిన చెల్లింపులను చేయటం కష్టమని ఆ దేశ ఆర్థిక కార్యదర్శి జానెట్ యెల్లెన్ అనటంతో అమెరికా దివాళా తీస్తుందనే హెచ్చరికలు పెరిగాయి.
ఒకవేళ అమెరికా చేయ గలిగే అప్పు పరిమితిని 31.4 ట్రిల్లియన్ డాలర్లకు పెంచటానికి ఆ దేశ కాంగ్రెస్ అంగీకరించకపోతే.. కొన్ని అప్పులను చెల్లించలేక దివాళాతీసే అవకాశం ఉందని ఆమె చెప్పారు. అమెరికా ప్రభుత్వం తన వ్యయం కోసం చేయగలిగే అప్పు పరిమితిని అమెరికా కాంగ్రెస్సే నిర్ణయిస్తుం దన్న సంగతి అందరికీ తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ శాసన సభ్యులు అమెరికాను దివాళా నుంచి గట్టెంకించ టానికి చెమటోడ్చుతున్నారు. ప్రభుత్వ దివాళాకు కేవలం పది రోజుల ముందు అప్పు పరిమితిని పెంచటం సాధ్యపడదని రిపబ్లికన్ పార్టీ నాయకుడు, ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీ ఇటీవల వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఈ విషయంపైన చర్చను కొనసాగిస్తామన్నారు. అప్పు పరిమితిని తాము పెంచటానికి ఒప్పుకునేముందు ప్రభుత్వ వ్యయంలో కోత విధించాలని రిపబ్లికన్లు పట్టు పడు తున్నారు. అయితే బైడెన్ ఈ రెండు విషయాలను కలపకుండా అప్పు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ఇంతకుముందూ అమెరికా అనేకసార్లు, అన్నిం టికంటే ముఖ్యంగా 2011లో తన అప్పు పరిమితిని దాటే ప్రమాదం అంచుకు చేరుకుంది. అయితే అమెరికా ప్రభుత్వం అప్పుతీసుకునే సామర్థ్యం పడిపోతున్న స్థితిలో కేవలం కొన్ని రోజులకు ముందు అప్పు పరిమితిని ఆ దేశ కాంగ్రెస్ పెంచటం జరిగింది.