శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు ఓ గుడ్ న్యూస్!

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు ఓ గుడ్ న్యూస్. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను విక్షించేందుకు వెళ్లే భక్తులను ఈ నెల 1 నుంచి 11వ రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం..పెద్ద దోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.  పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్దే వాహనాలను ఆపేస్తారు. అయితే, బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం తాజాగా ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చాడు. వాహనదారులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, నిదానంగా వాహనాలను నడపాలని దోర్నాల క్షేత్రాధికారి సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

Spread the love