జొన్నపంట ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

– డోంగ్లి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత 
నవతెలంగాణ – మద్నూర్ 
డోంగ్లి లో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ రేణుక చౌహాన్ కు గురువారం నాడు ఆ మండల జొన్న పంట రైతులు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ కు అందజేసిన వినతిపత్రంలో రైతులు పేర్కొంటూ ఉమ్మడి మండలంలో 1740 ఎకరాల్లో జొన్న పంట సాగవుతుందని తెలిపారు. దీనికి ప్రభుత్వం 3180 రూపాయలు మద్దతు ధర కల్పించింది మల్డాండి జొన్న 3225రూ ధర కల్పించింది కాబట్టి ఉమ్మడి మండలంలో రెండు వారాలు జొన్న కోతలు పూర్తి అవుతాయి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మోహన్, శంకర్ అప్పా, మాధవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love