నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీఎన్జీవో కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, మహిళా నేతలు ఉమాదేవి, శైలజ, అనురాధ, రంగారెడ్డి అధ్యక్షులు లక్ష్మణ్, హైదరాబాద్ నగరశాఖ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్ జిల్లా నాయకులు విక్రమ్, శ్రీనివాస్, రాజుకుమార్, మేడ్చల్ మల్కాజిగిరి నాయకులు భారత్ కుమార్, కేంద్ర సంఘం నేతలు నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అరుణ్ కుమార్, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌తో పాటు మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతి అని అన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల బాగు కోసం ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం తప్పకుండా దీపావళి లోపు పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు, ఉద్యోగుల కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పారు.
ఘనంగా బతుకమ్మ సంబురాలు
2:20 am