హెచ్ కేలూర్ లో ఘనంగా బోనాలు, చెరువు పండుగ

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కెలూరు గ్రామంలో గురువారం నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు భాగంగా ఉదయం బోనాల పండుగ సాయంత్రం బతుకమ్మ పండుగ చెరువులో అన్నదాన కార్యక్రమం పండుగ వాతావరణంలో గ్రామ సర్పంచ్ నీలావతి హనుమాన్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సర్పంచ్ అయినప్పటికీ ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాన్ని సర్పంచ్ గ్రామస్తుల ఆధ్వర్యంలో బోనాలు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ అనిల్ కుమార్ ఎంపీటీసీ సభ్యులు విజయ్ హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ గ్రామ పెద్దలు వందలాదిగా మహిళలు చిన్నారులు ఉత్సాంగ పాల్గొన్నారు.

Spread the love