ఘనంగా చెరువుల పండుగ..

– బతుకమ్మ కోలాటాలతో మార్మోగిన పల్లెలు
– హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్
నవతెలంగాణ – గూడూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చెరువుల కట్టలపై చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు చెరువుల కట్టలపై మైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు యాటపోతులు కోసి పండుగ సంబరాలు జరుపుకున్నారు తీగలవేణి ,గూడూరు, గ్రామాలలో నిర్వహించిన చెరువు కట్టలపై బతుకమ్మ కోలాటాల కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ హాజరయ్యారు మహిళలతో కోలాటం వేశారు మండలంలోని అన్ని గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శిలు వివిధ శాఖల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు వివిధ గ్రామాలలో వేరువేరుగా జరిగిన కార్యక్రమాలలో ఆప్షన్ నెంబర్ ఎండి కాసిం, టిఆర్ఎస్ పార్టీ మండల వేం వెంకటకృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ముక్క లక్ష్మణరావు, గూడూరు సర్పంచ్ నునావత్ రమేష్ , గూడూరు ఎంపీటీసీ కత్తి స్వామి, గూడూరు తాసిల్దార్ ఎమ్ అశోక్ కుమార్, ఎంపీడీవో రోజా రాణి, నీటిపారుదల శాఖ డి ఈ ఉపేందర్, ఏఈలు శేఖర్, శ్రీదేవి, ఆయా గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అంగన్వాడి టీచర్లు, వైద్య సిబ్బంది, వెలుగు సిబ్బంది మహిళలు బతుకమ్మలతో హాజరై పాల్గొన్నారు.

Spread the love