ఊమెన్‌ చాందీకి ఘనంగా తుది వీడ్కోలు

– 150 కిలోమీటర్లు సాగిన అంతిమయాత్ర
తిరువనంతపురం : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ అంత్యక్రియలు గురువారం ఘనంగా కొట్టాయంలో జరిగాయి. బుధవారం తిరువనంతపురం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర 150 కిలోమీటర్లు సాగి, గురువారం తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి ఊమెన్‌ చాందీ స్వస్థలం కొట్టాయం చేరుకుంది. తరువాత కొద్ది సేపు కొట్టాయం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డిసిసి) కార్యాలయం ముందు ముందు ఊమెన్‌ చాందీ భౌతిక కాయాన్ని ఉంచారు. ఉదయం 11 గంటల సమయంలో తిరునక్కర మైదానంలో అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరయ్యారు. బుధవారం సాయంత్రం నుంచే కొట్టాయం వీధులన్నీ జనంతో నిండిపోయాయి. పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Spread the love