– ముగ్గురికి స్వల్ప గాయాలు
నవతెలంగాణ – బెజ్జంకి
డ్రైవర్ అజాగ్రత్తతో హార్వేస్టర్ కారు డికొట్టగా ముగ్గిరి స్వల్ప గాయాలైన సంఘటన మండల పరధిలోని తోటపల్లి గ్రామ స్టేజ్ రాజీవ్ రహాదారిపై శనివారం చోటు చేసుకుంది.పోలీసుల వెల్లడించిన వివరాల మేరకు సునీల్ కుమార్(34),తన భార్య వనిత,కుమారుడు వేదాన్స్ తో కలిసి హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు కారులో వేళ్తున్నారు. తోటపల్లి గ్రామ స్టేజ్ వద్ద ఊరిలో నుండి రాజీవ్ రహదారిపై వస్తున్న హార్వేస్టర్ కారును డికొట్టింది.సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలై కారు ఎడమవైపు ధ్వంసమైంది.హార్వేస్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.