అశ్వారావుపేట( వినాయకపురం) ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన దిబ్బ గూడెం కాలనీ లో వైద్యాధికారి డాక్టర్ రాందాస్ పర్యవేక్షణలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 46 మందిని పరీక్షించి చిరు వ్యాధులకు చికిత్స అందించారు. జ్వరం తో బాధపడుతున్న 9 మందిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.మలేరియా నిర్ధారణ కాకపోవడంతో తరుణ వ్యాధులకు చికిత్స అందించారు. ఇద్దరు గర్భవతులకు పరీక్షించి, ఆసుపత్రికి వచ్చి పలు రక్త పరీక్షలు చేయకుకొని ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవాలని సూచించారు.
కాచి చల్లార్చి నీరు తాగాలని, దోమతెరలు సక్రమంగా వాడాలనీ,ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లే కుండా చూచుకోవాలని ప్రజులకు ఆరోగ్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు,హెచ్. ఇఓ రాజు, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్, హెచ్.ఎ సత్యనారాయణ, ఎ.ఎన్.ఎం చెల్లెమ్మ, ఆశా కార్యకర్త పాల్గొన్నారు.