డాక్టర్లు లేని దవాఖాన

ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో మండల పరిధి లోని బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర ఇన్‌చార్జీ డాక్టర్‌ తప్ప పూర్తిస్థాయిలో పని చేసే– పొంచి ఉన్న సీజనల్‌ ముప్పు
పేరుకు పెద్ద మండలం. జనాభా 50వేల పైచిలుకు ఉంది. కాని ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రం ఒకటే ఉంది. మిగతా మండలాల్లో మూడు నుంచి ఐదు ఆస్పత్రులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ఒక్క ఆస్పత్రిలో డాక్టర్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల నలుమూల నుంచి రోగులు రావాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. అవస్థలు పడి ఇక్కడికి వచ్చిన సరైన సౌకర్యాలు లేవు. దీంతో ప్రయివేట ఆస్పత్రికి వెళున్నారు. కాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనర్హం. ఇప్పటికైన భట్టి దృష్టి సారించి వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని కోరతున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో సీజనల్‌ వ్యాధులు విజృంభించాయి. గ్రామాలలో ఇప్పటికే ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో మండల పరిధి లోని బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర ఇన్‌చార్జీ డాక్టర్‌ తప్ప పూర్తిస్థాయిలో పని చేసే డాక్టర్లు లేరు. 30 పడకలు గల ప్రభుత్వ ఆస్పత్రుకి వైద్యులు లేని వైద్యశాలగా మిగిలిపోయింది. 31 గ్రామపంచాయతీలు కలిగి, 50 వేల పైబడి జనాభా కలిగిన పెద్ద మండలంలో ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండటం విడ్డూరంగా ఉందని ప్రజలు ప్ర శ్నిస్తున్నారు. వేరే మండలాలలో మూడు నుండి నాలుగు వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇంత పెద్ద మండలానికి ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య ఉండటం కేంద్రానికి రావాలంటే సుమారు 20 కిలోమీటర్ల పైబడి ప్రయాణం చేయాల్సి ఉం టుందని ప్రజలు వాపోతున్నారు.
ఈ ఆస్పత్రిలో ఐదుగురు డాక్టర్లు విధులు నిర్వహించవలసి ఉండగా ఒక్క డాక్టర్‌ లేకపోవడంతో ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు భరోసా ఇచ్చేది ఎవరని ప్రజలు విమర్శిస్తున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఫార్మసిస్ట్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేయడం ఇదేనా అని అడుగుతున్నారు. ప్రభుత్వం చేసిన సాధారణ బదిలీలలో భాగంగా నలుగురు ఏఎన్‌ఎంలు బదిలీలు కాగా ఒక ఏఎన్‌ఎమ్‌ మాత్రమే బదిలీలో భాగంగా మండలానికి వచ్చారు. మామునూరు, భీమవరం, జమలాపురం గ్రామాలకు చెందిన ముగ్గురు ఏఎన్‌ఎంల బదిలీల స్థానంలో తిరిగి ఏఎన్‌ఎంలను నియామకం జరపలేదు. ఏడు సెకండ్‌ ఏఎన్‌ఎంలను ఆనాడు నియామకం చేపట్టకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని ప్రజలు విమర్శిస్తున్నారు. మండలంలో కలిగి ఉన్న జనాభా ప్రాతిపదికన ముంచుకొస్తున్న సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఐదుగురు వైద్యాధికాల ఖాళీలను, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌ పోస్టులను భర్తీ చేయాలని బదిలీలపై వెళ్లిన ఏఎన్‌ఎంల స్థానంలో నియామకం చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. వైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చేసి ప్రజలకు కావలసిన వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. డిప్యూటీ సీఎం దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love