గాలి దుమారానికి కూలిన రేకుల ఇల్లు

నవతెలంగాణ-చంద్రుగొండ
అనూహ్యంగా వచ్చిన గాలి దుమారానికి రేకుల ఇల్లు కుప్పకూలిన సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు వివరాల ప్రకారం బాలికుంట గ్రామానికి చెందిన గోగుల తిమ్మయ్య వ్యవసాయ కూలిగా జీవనోపాధి పొందుతూ స్థానికంగా రేకుల డు నిర్మించుకొని నివాసం ఉంటు న్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వచ్చిన గాలిదుమారానికి రేకుల షెడ్డు కుప్ప కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెక్కడితే గాని డొక్కాడని తనకు నిలువ నీడను కోల్పోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంట్లోనే నిత్యావసర సామాన్లు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిలిందని, అధికారులు స్పందించాలని వేడుకుంటున్నాడు.

Spread the love