జపాన్‌లో భారీ భూకంపం..

నవతెలంగాణ  – జపాన్: జపాన్లోని హోక్కాయిడో దీవుల్లో ఆదివారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. అయితే, ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని సమాచారం. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.ఈ ప్రాంతంలోని అణ్వస్త్ర కేంద్రాలకు ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. ఉత్తర ప్రాంతంలో తిరుగుతున్న బుల్లెట్ రైళ్లకు విద్యు్త్ సరఫరాలో ఎటువంటి అంతరాయం జరుగలేదు. భూకంప కేంద్రం హొక్కాయిడో దీవికి వాయవ్య దిశగా 140 కి.మీ. లోతున కేంద్రీక్రుతమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత ప్రభావంతో చిటోస్, అస్టుమాచో నగరాలతోపాటు దీవి అంతటా జీవిస్తున్న ప్రజలు అల్లాడి పోయారు. దేశ రాజధాని టోక్యో గల ఉత్తర దిశగా ఉన్న హోంషుదీవిలోనూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపాలకు పెట్టింది పేరుగా జపాన్ ఉన్న సంగతి తెలిసిందే.

Spread the love