నవతెలంగాణ – టోక్యో: జపాన్లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. జపాన్ రాజధాని టోక్యోకు ఆగ్నేయం వైపున 107 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుందని ఆ దేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి భూ ఉపరితలం నుంచి 65 కిలోమీటర్ల లోతువరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 3.33 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది.