నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న దేవి మెస్ లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంటగదిలో ప్రారంభమైన మంటలు క్రమంగా హోటల్ మొత్తానికి విస్తరించాయి. దీంతో పెద్దఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.