హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

fire accidentనవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లోని గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థర్మాకోల్ తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 6 ఫైర్ ఇంజన్ లతో మంటలార్పుతున్నారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love