నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2024 టోర్నమెంటు త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 ఫస్ట్ ఎడిషన్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మొదటి విడత షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… విడతల వారీగా ఐపీఎల్ నిర్వహించనున్నారు. అయితే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కు వరుస షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఐపిఎల్ కు రోహిత్ శర్మ దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. అయితే తాజాగా సూర్య కుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్ పూర్తిగా ఆడబోడని తెలుస్తోంది. అతనికి తీవ్ర గాయమైందని సమాచారం. టి20 వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ కు దూరంగా ఉండాలని సూర్య కుమార్ యాదవ్ అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.