సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో కీలక మార్పు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తోన్న విషయం తెలిసిందే. గత మూడు సీజన్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదు. గతేడాది 14 మ్యాచ్‌ల్లో నాలుంగింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం కోసం జట్టులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది యాజమాన్యం. హెడ్‌ కోచ్‌గా ఉన్న బ్రయాన్ లారాను తొలగించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ వెటోరిని ప్రధాన కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ట్వీట్ చేసింది. సన్‌రైజర్స్‌కు వెటోరి నాలుగో హెడ్ కోచ్‌. అతనికంటే ముందు టామ్ మూడీ ట్రెవర్ బేలిస్ (2020-2021), లారా (2023) ప్రధాన కోచ్‌లుగా వ్యవహరించారు. డానియల్ వెటోరికి ఐపీఎల్‌లో కోచ్‌గా అనుభవముంది. ఆర్సీబీకి 2014 నుంచి 2018 వరకు కోచ్‌గా పనిచేశాడు.

Spread the love