రైల్వేశాఖ కీలక నిర్ణయం

నవతెలంగాణ – ఒడిశా
బాలాసోర్ ఘోరరైలు ప్రమాదం ఘటనపై రైల్వే మంత్రిత్వశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేకు చెందిన పలువురు సీనియర్ అధికారులను బదిలీకి ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్ ఈస్ట్రన్ రైల్వే  సిగ్నలింగ్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. జూన్2న ఒడిశాలోని బాలాసోర్ వద్ద రెండు రైళ్లు, ఒక గూడ్స్ ఢీకొన్న ఘటనలో దాదాపు 300 మంది మృతిచెందగా, 11వందల మంది క్షతగాత్రులయ్యారు. విధ్వంసం సృష్టించిన ఈ ఘటన తర్వాత రైల్వే నెట్‌వర్క్ భద్రత, నిర్వహణ సిబ్బందిని మార్చాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) మహ్మద్ షుజాత్ హష్మీ బదిలీ చేశారు. ప్రస్తుతం చైర్మన్ ఆర్ఆర్బీ అజ్మీర్ పదవిలో ఉన్న కేఆర్. చౌదరి ఖరగ్‌పూర్ కొత్త డీఆర్ఎంగా నియమించారు.

Spread the love