ఖర్గే నివాసంలో ముగిసిన కీలక భేటీ

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ కీలక భేటీకి రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్‌గాంధీ వెళ్లిపోయారు.

Spread the love