తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై ఢిల్లీలో కీలక సమావేశం ప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కీలక సమావేశం మొదలైంది. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర జల శక్తి కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలను, వాటికి అనుబంధంగా ఉన్న నిర్మాణాలను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రక్రియను జలశక్తి శాఖ ప్రారంభించనుంది. గత మూడు రోజులుగా నాగార్జునసాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. సీఆర్పీఎఫ్ సీఐఎస్ఎఫ్ భద్రత పరిధిలోకి రెండు జలాశయాలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. జలాశయాల నిర్వహణ అంత కేఆర్ఎంబీకి అప్పగించాలని ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేఆర్‌ఎంబీ పర్యవేక్షణలో సీఆర్పీఎఫ్ సీఐఎస్ఎఫ్ బలగాల రక్షణలోకి కేంద్రం తీసుకురానుంది. ఈ అంశాలపై చర్చించి ఒక నిర్ణయాన్ని కేంద్ర జల శక్తి శాఖ వెలువరించే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

Spread the love