దంతేవాడ దండకారణ్యంలో పేలిన మందుపాతర

– ఇద్దరు జవాన్లకు, మీడియా ప్రతినిధికి సైతం గాయాలు
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టు అమర్చిన మందుపాతర పేలింది. దంతెవాడ జిల్లాలోని బార్సుర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బ్రిడ్జి వద్ద ఈ నెల 2 నుండి 8 వరకు పిఎల్‌జిఏ వారోత్సవాలు వాడవాడలా జరపాలని మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు వేశారని సమాచారంతో తీయడానికి వెళ్లిన సిఆర్పిఎఫ్‌ 195 బెటాలియన్‌ కు చెందిన ఇద్దరు జవాన్లకు, ఒక మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చిన ఘటనతో ఆ ప్రాంత ఆదివాసీ గ్రామాలు బీతరిల్లి పోయాయి. హుటాహుటిన వారిని వైద్యశాలకు పోలీసు బలగాలు తరలించి వైద్యం చేపించడం జరిగింది. శనివారం నుండి 8 వరకు పి.ఎల్‌.జి. ఏ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గ్రామగ్రామాన వారోత్సవాలు జరుపుకోవాలని ఇప్పటికే మావోయిస్టులు పిలుపు ఇచ్చిన విషయం పాఠకులకు విదితమే.

Spread the love