లీడర్ డెవలప్మెంట్ మోబిలేషన్ సమావేశాన్ని విజయవంతం చేయాలి..

కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్
నవతెలంగాణ – తాడ్వాయి
లీడర్ డెవలప్మెంట్ మోబిలేషన్ (ఎల్డీఎం) మంగళవారం జరుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ అన్నారు. మండల కేంద్రము లో మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు మన ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మన ప్రియతమ నాయకురాలు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్, డాక్టర్ అనిల్ లు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రముఖ నాయకులు సర్పంచులు, ఉపసర్పంచ్ లు, సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు, ఎంపిటిసిలు, అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, మహిళ నాయకురాళ్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love