నిరంతర శ్రామికుడు సెలవు లేని సేవకుడు
వైద్య పితామహుడు ‘బిసి రారు’
నేడు జాతీయ డాక్టర్స్ డే
మానవ సేవే మాధవ సేవ అనే నానుడి వైద్యుల నుంచి పుట్టిందని గర్వంగా చెప్పవచ్చు. ప్రజలకు కనిపించని భగవంతునికి కంటే ఆరోగ్యం బాగుచేసిన వైద్యుడినే భగవంతునితో సమానంగా ఆరాధిస్తారు. అలాంటి దార్శనికతకు నిలువెత్తు నిదర్శం బిసి రారు. అందుకే ఆయన చరిత్రలో చిరస్మరణీయులుగా చిరస్థాయిగా నిలిచారు. అలాంటి గొప్ప మహానుభావుడి అడుగుజాడలలో నడిస్తే జీవితానికి, వైద్య రంగానికి సార్థకత ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టిన నేటి, రేపటి వైద్యులు, వైద్యులను ఆరాధిస్తున్న ప్రజల కోసం డాక్టర్స్ డే ప్రాముఖ్యత గురించి నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే మహోన్నతమైన సంకల్పం గల గొప్ప వ్యక్తి డాక్టర్ బిసి రారు. డాక్టరు బిదాన్ చంద్రరారు వైద్య పరంగానేగాక రాజకీయంగాను ప్రతిభను కనపరిచిన మానవతావాదిగాను, ప్రజ్ఞాశాలిగా చెప్పవచ్చు. ఆయన జీవితంలో వైద్య, రాజకీయ రంగాల్లో ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారు. తన జీవితాన్ని వైద్యరంగానికి అంకితమిచ్చిన మహోన్నత వ్యక్తి బిసి రారు జన్మదినం, వర్థంతి సందర్భంగా వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాంటి మహోన్నత వ్యక్తిని గుర్తు చేసుకోవడం సముచితంగా ఉంటుంది. వైద్య వృత్తిని పవిత్రంగా భావించిన డాక్టర్ బిసిరారు జాతిపిత మహాత్మాగాంధీకి వ్యక్తిగత వైద్యునిగా పని చేశారు. ప్రజలకు వైద్యం అందించడాన్ని జీవితాశయంగా ఎంచుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని బంకిపూర్‌లో ప్రకాష్‌చంద్రరారు, అగోరకామినీదేవి దంపతులకు రారు 1882 జులై 1న జన్మించారు. ఆయన 1906లో ఎల్‌ఎంఎస్ ఉత్తీర్ణుల య్యారు. 1908లో ఎమ్‌డి పాసయ్యారు. 1911లో ఎఫ్‌ఆర్‌సిపి పరీక్ష, అదే సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌సిఎస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మాతృదేశానికి తిరిగొ చ్చి గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ కలకత్తా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలను నిర్వహించారు. 1922 నుంచి 1929 వరకు కలకత్తా మెడికల్ జర్నల్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. 1929-30 సంవత్స రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. 1931లో కలకత్తా కార్పొరేషన్‌కు మేయర్‌గా ఎన్నికయ్యారు. 1937-38లో ఐఎంఎ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 1938లో బెంగాల్ ప్రొవిన్సియల్ కాంగ్రెస్ కమిటీ కి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1940లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యాకు ప్రథమ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1941 నుంచి 1945 వరకు కలక త్తా యూనివర్శిటీకి వైస్‌ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. 1947లో ఉత్తరప్రదేశ్ గవ ర్నర్‌గా నియమితులయ్యారు. 1948 జనవరి 23న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1962 జులై 1న డాక్టర్ బిదాన్ చంద్రరారు మృతి చెందారు. ఆయన జీవిత గమనంలోని అనుక్షణం ప్రజా సేవకు ప్రాధాన్యతనిచ్చి మానవతావాదాన్ని చాటిన సేవా ప్రదాత డాక్టర్ బిసి రారుని నేడు స్మరించుకుందాం. అయన అడుగు జాడల్లో ప్రతి వైద్యుడి నడిచి ప్రజాసేవలో పాత్ర వహించాలని కోరుకుందాం.