కెమికల్ లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం..

నవతెలంగాణ – ఖమ్మం: ఘోర ప్రమాదం.. కూసుమంచి మండలం గుర్వాయిగూడెం సమీపంలో ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై కెమికల్ లోడుతో వెళ్తున్న లారీ ఇంజన్ లో మంటలు రావడంతో లారీ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. లారీ డ్రైవర్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయినవి వారిని వేంటనే హాస్పిటల్ కు తరలించారు. సీఐ కంది జితేందర్ రెడ్డి ఎస్సై రమేష్ కుమార్ సంఘటన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు.

Spread the love