బైక్ ను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందనవనంలో బైక్ ను లారీ ఢీకొట్టిడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. లారీ దూసుకెళ్లడంతో డెడ్ బాడీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love