నవతెలంగాణ-గండిపేట్
నగర శివారులో వినాయక నిమజ్జనం ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ల డ్డువేలం పాటలు నిర్వహించారు. నార్సింగి మున్సిపాలి టీలోని వట్టినాగులపల్లి ఎంజెపీ యూత్ ఆసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ పతి లడ్డును డప్పు సాయి రూ. ఏడు లక్షల పదివేలకు సొంతం చేసుకున్నారు. గౌలిదొడ్డి గ్రామం లో బాజీరావ్ నర్సింగ్ రూ.లక్ష 30 వేలకు లడ్డును నార్సింగి ఛైర్ పర్సన్ రేఖాయాదగిరి సమక్షంలో కైవసం చేసుకున్నారు. నార్సింగి 8వ వార్డులో శ్రీ సిద్ది వినాయక కాలనీలో కౌన్సిలర్ పత్తి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో శంకర్ లక్ష రూపాయాలకు లడ్డు కైవసం చేసుకున్నారు. నార్సింగి మున్సిపాలిటీలోని బాలాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డును రూ.లక్ష 65 వేలకు జగ్గు చం ద్రశేఖర్ సొంతం చేసుకున్నారు. నిర్వహకులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పత్తి ప్రవీ న్‌కుమార్, నాయకులు ప్రదీప్‌కుమార్, విష్ణువర్థన్, బక్కని సాయికు మార్, పర్వేద రాజు, సాయికుమార్, సత్తీష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.